జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 06 at 19.28.24

TRINETHRAM NEWS

ఆర్చరి క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, నవంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడలకు ఎంపికైన సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన క్రీడాకారుడు తానిపర్తి యశ్వంత్ ను జిల్లా కలెక్టర్ కోయ హర్ష బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో అభినందించారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ 4న జరిగిన 68వ రాష్ట్ర స్థాయి ఎస్.జి.ఎఫ్.ఐ ఆర్చరీ పోటీలలో పాల్గొన్న సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన క్రీడాకారుడు తానిపర్తి యశ్వంత్ అండర్ 17 బాయ్స్ కాంపౌండ్ విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది.

గుజరాత్ రాష్ట్రం నాథ్యాడ్ లో నవంబర్ 11, 12 తేదీలలో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు మన పెద్దపల్లి జిల్లా విద్యార్థి ఎంపిక కావడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page