Chhoppadandi Municipality is in a predicament of not being able to arrange Ganesh immersion
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున గణేష్ నిమజ్జనం శోభయాత్ర అత్యంత అద్భుతంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే చొప్పదండి పట్టణంలో డివైడర్ పనుల వలన రోడ్లు గుంతలు పడి శోభయాత్ర చేయుటకు అనువుగా లేదు, సరైన వసతులు కల్పించాల్సిన మున్సిపల్ విఫలమైందని ఒక వర్గం ప్రజలపై వివక్ష చూపుతోందని ఈ సందర్భంగా అన్నారు. దీనిపైన ప్రతి పండుగలకు సరైన వసతులు కల్పించి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మున్సిపల్ వారికీ బాధ్యత ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని కనీసo గుంతలు పూడ్చకుండా పోవడం చొప్పదండి మున్సిపాలిటీ దురదృష్టమని ఈ సందర్భంగా వడ్లూరి గంగరాజు జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మరియు 6వ వార్డు కౌన్సిలర్ అన్నారు.
శోభయాత్రలో భక్తులు ఇబ్బంది పడితే అది చొప్పదండి మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు నిమజ్జనం ఏర్పాట్లు చేయుటకు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి కాంట్రాక్టర్లు కొమ్ముగాసి వారిపైఉన్న ప్రేమ ప్రజల పైన లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రేపటి శోభాయాత్రను నిర్వహించుటకు వెంటనే రోడ్లపైన తాత్కాలిక పద్ధతిన మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ వారిని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సొమ్ము పన్నుల రూపంలో పీడిస్తూ ప్రజాధనాన్ని వారికోసం సంవత్సరంలో ఒక్కరోజు వన్ పర్సెంట్ ఖర్చు చేయలేకపోవడం మున్సిపల్ పాలకవర్గం గానీ అధికారులు గానీ లేరని దీన్ని బట్టి అర్థమవుతుంది అని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లూరి వెంకటస్వామి, వడ్లూరి అఖిల్, కల్లేపల్లి హరీష్ గడ్డం హరికృష్ణ కనకట్ల రమేష్, మాచర్ల అజయ్, కోలపురి ప్రభాకర్, కోక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App