దేవరకొండ డివిజన్ నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనమునందు ఉదయం 11 గంటలకు అధ్యక్షుడు ఎన్ వీ టీ క్లబ్ సభ్యులతో కలిసి జవహర్ లాల్ నెహ్రు పటానికి విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయులను మరవరాదని,జవాహర్ లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు.
పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, కె పంతులాల్,బత్తుల అమర్ రాపోలు నిరంజన్, భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, రాజకుమార్ రెడ్డి, శేఖర్, మహేందర్, వంగూరు వెంకటేశ్వర్లు,నరసింహ, నాగరాజు, గోపి ,కిషన్, సవారి, ప్రసాద్, సురేష్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


