Children’s Day : కృష్ణవేణి విద్యాసంస్థలలో బాలల దినోత్సవ కార్యక్రమం

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు కృష్ణవేణి విద్యాసంస్థలలో జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం ను కృష్ణవేణి పాఠశాల గోదావరిఖని అడ్డగుంటపల్లిలో నిర్వహించడం జరిగినది. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంజుల శ్రీనివాస్ రెడ్డి విచ్చేసి జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలతో సత్కరించడం జరిగినది తర్వాత వారు చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి విద్యార్థులకు క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, మరియు చిన్న పిల్లలకు ఫ్యాషన్ షో సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది.

విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు. మంచి సమాజం నిర్మించాలి అంటే నేటి బాలలతోనే సాధ్యం అవుతుందని తెలియజేయడం జరిగినది. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. కార్యక్రమం చివరగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందమును అభినందించడం జరిగినది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Children's Day program in Krishnaveni educational institutions

You cannot copy content of this page

Scroll to Top