త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ఇటీవలె హాస్పటల్స్ నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 36 మందికి రూ.32,38,117/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా సదరు చెక్కులను మంగళవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, చేతులమీదిగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


