జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 21 at 16.39.24

TRINETHRAM NEWS

Chief Minister Chandrababu is leading the state in terms of development

Trinethram News : విజయనగరం కోట : ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈరోజు విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించడమైనది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు , పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు నియోజకవర్గంలో గల రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, పట్టణ/మండల స్థాయి నాయకులు, వార్డు/గ్రామ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జులు, కార్పొరేటర్, ఎంపిటిసి, సర్పంచ్/ అభ్యర్థులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు, రాష్ట్ర ప్రజలకు సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందిస్తూ ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకుందామన్నారు, అదేవిధంగా విజయనగరం నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం మన బాధ్యత అని, అందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం ద్వారా శ్రేణులు అందరు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Chandrababu is leading the state in terms of development

2 thoughts on “CM Chandrababu : రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Comments are closed.

You cannot copy content of this page