ఏడాది పాలనలో వేధింపులు తప్ప అభివృద్ధి లేదు
వైయస్‌ఆర్‌సీపీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్,మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,
జి.మామిడాడలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి, అబద్ధాలు, వెన్నుపోటు చంద్రబాబు అధికారం లోకి రావడానికి మెట్లు అని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అన్నారు. జి.మామిడాడ గ్రామంలో మంగళవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఏడాదిలోనే పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు.
గత ప్రభుత్వంలో చిత్తశుద్ధితో అమలు చేసిన సంక్షేమ పథకాలు, విధానాలను, ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ వాటిని విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రజలను చైతన్యపరచాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు చూపించి, ఏ విధంగా మోసం చేశారో తెలియజేయాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ఏడాది కాలంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు చేసిన అరాచకాలను ప్రజలకు గుర్తుచేయాలన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు 2.0లో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.
సంక్షేమంపై మాట్లాడలేని ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ మారి ఎమ్మెల్యే అయినా, ఆయన సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో మాట్లాడలేదని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, విమర్శించారు. అలాగే రైతులకు రైతు భరోసా, ధాన్యం విక్రయించిన సీఎంఆర్ బకాయిలు ఇప్పించలేదని మండిపడ్డారు. ఇప్పుడు దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు.. మళ్లీ వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఊళ్లు వదిలిపోయే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి (అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్), కేత తులసి శ్రీనివాస్ (ఎంపీపీ), గుత్తుల రమణ(పెదపూడి మండల కన్వీనర్), అద్దంకి ముక్తేశ్వరరావు(రాష్ట్ర నాయకులు), మండ రాజారెడ్డి (రాష్ట్ర నాయకులు), నాగమల్లి వీరభద్రరావు (రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు), నల్లమిల్లి విజయ రెడ్డి (రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి), శ్రీ వెంకటరెడ్డి (వైస్ ఎంపీపీ), సాంబత్తుల చంటి (అనపర్తి నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు), మహిళ కార్యకర్త ప్రమీల, సుందరపల్లి సుధాకర్, కోసూరి వాసు (పెదపూడి సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు), ప్రమీల వీరభద్రరావు (పైన సర్పంచ్), దుర్గా భవాని శ్రీనివాస్ (రాజుపాలెం ఎంపీటీసీ),కర్రి వెంకట రెడ్డి (మండల కో ఆప్షన్ సభ్యుడు), వీర్రెడ్డి (ఎంపీటీసీ), మేడపాటి తాతారెడ్డి (ఉప సర్పంచ్), రాయుడు రాఘవ, గుడిమెట్ల మురళి, సబ్బెళ్ళ మోహన్ రెడ్డి (మండల బూత్ కన్వీనర్), వేణు (సోషల్ మీడియా కన్వీనర్), కురిపూడి మాధవి లత శ్రీనివాస్ (గండ్రేడు సర్పంచ్), మీనాక్షి కృష్ణ (పెద్దాడ సర్పంచ్), సమ్మంగి దుర్గాప్రసాద్ (పెదపూడి ఎంపిటిసి), మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ కన్వీనర్లు, తదితరులు పార్టీ నాయకులు, మండల నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


