జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 14 at 6.37.45 PM

TRINETHRAM NEWS

Chandrababu: వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు సెటైర్లు

అమరావతి..

వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లెక్కలు తారుమారయ్యాయని.. 11 మందికి సీట్లు మార్చేశారని ఆయన అన్నారు..

మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఊహించలేదని.. ఓ చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారని ఆయన ప్రశ్నించారు. దళితులు, బీసీలనే బదిలీ చేశారని.. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా అని చంద్రబాబు అన్నారు. ఇంత మందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదన్నారు. జగన్ మనుషులు.. బినామీలను ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. పేదవారి సీట్లే మారుస్తారా.. 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదన్నారు. ప్రజలను టేకిట్ గ్రాంటెడుగా తీసుకోవడం దారుణమన్నారు..

You cannot copy content of this page