ఘనంగా జరుగుతున్న శారదా దేవి నవరాత్రి ఉత్సవాలు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం, సెప్టెంబర్ 27 : కడియం మండలం దుళ్ల మార్కెట్ సెంటర్ లో కొలువైన శ్రీ శారదా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోనే పేరొందిన ఈ ఉత్సవాలు లో భాగంగా శనివారం చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది.. ఆచార్య మాన్ మోహన శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఈ చండీ హోమం కన్నుల పండువగా జరిగింది.. పదుల సంఖ్యలో దంపతులు ఈ చండీ హోమం లో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అలాగే అధిక సంఖ్యలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదములు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ తగిన చర్యలు తీసుకున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


