Chain Snatching : మామిడికాయ కోసం వెళ్తే.. బంగారు గొలుసు చోరీ

TRINETHRAM NEWS
Chain Snatching If you go for mango

Chain Snatching త్రినేత్రం న్యూస్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌లో పట్టపగలే దారుణ చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంటి సమీపంలో ఉన్న చెట్టు నుంచి మామిడికాయ రాలితే, దానిని తీసుకునేందుకు వెళ్లిన ఓడ్నాల భూలక్ష్మి అనే మహిళను టార్గెట్ చేస్తూ ఓ దుండగుడు బైక్‌పై వచ్చాడు. ఆమె మామిడికాయ తీసుకుని తిరిగి వస్తుండగా, ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నిక్షిప్తమవగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top