అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జూలై 22 : జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ అల్లూరిజిల్లా, అరకువ్యాలీ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభించకపోవడాన్ని ఆదివాసి గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు (ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు), పి.రామన్నలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అడ్మిషన్లు ఆలస్యం కావడంతో గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్య నుంచి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభించాలని, లేకపోతే విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ప్రభుత్వంతో పాటు ఐటిడిఏ అధికారులు చొరవ చూపి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


