వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: అంగవైకల్యానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు మాసాల్లోపు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో సదరం/యుడిఐడి శిబిరాల నిర్వహణపై డిఆర్డిఓ, వైద్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో అంగవైకల్యంతో కూడిన ప్రతి ఒక్కరికి సదరం, యుడిఐడి శిబిరాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలోవెయిటింగ్ జాబితాలో వివిధవైకల్యాలతో కూడిన 689 అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలు అందజేసేందుకు వీలుగా అధిక శిబిరాలనుఏర్పాటు చేసిధ్రువీకరణ పత్రాలుఅందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్యాంపులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పరీక్షల నిర్వహించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, కొడంగల్, వికారాబాద్ వైద్య కళాశాలల ప్రిన్సిప పద్మ, మల్లికార్జున్, డీపీఎం నర్సింలు, ఏపిఎం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


