జూలై 23, 2026
TRINETHRAM NEWS
Central assistance

Central Assistance : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 21; టెక్కలి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు కింజారపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతం, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు మంత్రి కి ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులకు సాగు సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ శాఖ పనిచేస్తోందని, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు.
వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉందని పేర్కొన్నారు. లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా వ్యవసాయంపై, మరోవైపు ఉద్యానవనం, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య, ఆక్వా తదితర అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉత్పాదకత పెంపుతో పాటు పంటల మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రైతు పండించిన పంటకు సరైన ధర లభించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

పంటల సాగులో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు రైతులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్న నేపథ్యంలో, రైతులకు సాగు ఖర్చులు తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు. నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, పంటల ఉత్పత్తి వ్యయం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటల కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు.

అదేవిధంగా వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి, అధిక వర్షాలు, తుపాన్లు తదితర కారణాలతో రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను కూడా మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు తక్షణ సహాయం అందించడంతో పాటు పంట నష్టపరిహారం, బీమా ప్రయోజనాలు సకాలంలో అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరమని తెలిపారు. రైతులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలని కోరారు.

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించారు. డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, మట్టి ఆరోగ్య పరిరక్షణ, నీటి సమర్థ వినియోగం, పంటల ఉత్పాదకత పెంపు వంటి అంశాల ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కల్పించవచ్చని వివరించారు. చిన్న, సన్నకారు రైతులకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర సహకారం అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు, పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, గోదాములు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని అన్నారు . వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులుగా కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో భాగస్వాములు అయ్యే విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అభినందించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించేందుకు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందించడం నుంచి పంట చేతికొచ్చిన తర్వాత మార్కెటింగ్‌ వరకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page