జూన్ 26, 2026

IMG 20241201 WA0057

TRINETHRAM NEWS

మాల మాదిగ బీసీ ల జనగణన జరిపి రిజర్వేషన్లు అమలు జరపాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యనాయక్ డిమాండ్ చేస్తూ
మన దేశంలో అధిక సంఖ్యలో ఉండి అతి తక్కువ ఫలాలు పొందుతున్న మాల మాదిగ బీసీ కులాల మరియు వాటి ఉపకులాల ఆధారంగా జనగణన జరిపి రిజర్వేషన్లు అమలు జరపాలని బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరుగుతున్న మాలల సింహ గర్జన సభకు మద్దతు తెలియజేస్తూ. ఈ దేశంలో మాల మాదిగలే కాకుండా ఆదివాసులు గిరిజనులు సంచార జాతులు అనేక మంది ఉండగా దేశంలో సగభాగం ఉన్న బీసీ మరియు అనుబంధ కులాల లెక్క తేల్చకుండా ఈ రోజూ అనాదిగా వెనుకబడిన దోపిడీకి గురవుతున్న మాల మాదిగల మధ్య కుంపటి రగల్చడం సరి కాదని అన్నారు. అంటరానితనం పేరుతో సమాజానికి దూరంగా వెలివాడలుగా ఉంచిన ఈ కులాలను మళ్ళీ ఇలా విభజించి పాలించు సూత్రం తో ఐక్యం కాకుండా చేయడం దుర్మార్గం అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి అధిక సంఖ్యలో ఉన్న బహుజనులకు, ఆదివాసులకు గిరిజనులకు వారి సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీఎంపీ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నేనావత్ హరి నాయక్, బీఎంపీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, దోమ మండల బీఎంపీ ప్రధాన కార్యదర్శి కేతావత్ రవీందర్ నాయక్, దోమ మండల బీఎంపీ కార్యదర్శి గణేష్ నాయక్, ఆనంద్ నాయక్, శంకర్, గట్టుపల్లి రవి, బాబ్య నాయక్, దోమ మండల బీఎంపీ నాయకులు మూడవత్ రవీందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page