SP K. Narayana Reddy : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సంధార్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 8:45 గంటలకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్.పి.) కె.నారాయణ రెడ్డి, జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ రోజున రాష్ట్రం ప్రజాస్వామ్య, సమానత్వ, న్యాయ విలువలతో కూడిన పాలనలోకి అడుగు పెట్టిందని గుర్తు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది మరియు జిల్లా ప్రజలందరికీ ఆయన ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఏ విధంగానైతే సమాజ సేవ చేయాలనే ఉత్సాహంతో విధులలో చేరామో, అదే ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించాలి” అని పిలుపునిచ్చారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి మన వంతు కృషిని నిస్వార్థంగా అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, వికారాబాద్ డి.ఎస్.పి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఏ.ఆర్. డి.ఎస్.పి వీరేష్, ఇన్స్పెక్టర్ అధికారులు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Public Administration Day

You cannot copy content of this page

Scroll to Top