-యువతకు మార్గనిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్
-తెలంగాణ ఐటి కి బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్
-యువతకు మార్గ నిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్
-అభివృద్ధిలో రాష్ట్రానికి వన్నె తెస్తు దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం రాజకీయ దురంధరుడు కేటిఆర్
-బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Trinethram News : దేవరకొండ జులై 24 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ఐటీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిరకాలం ప్రజాసేవలో సేవ కొనసాగాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం దేవరకొండ పట్టణంలో బస్ స్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ పురస్కరించుకొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలందరి ఆశీర్వాదంతో కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.లక్ష్యంతో రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి,రాష్ట్ర రాజకీయాల్లో అడుగు వేసి ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నా గొప్ప నాయకుడు కేటీఆర్ అని ఆయన అన్నారు.
ఆ రోజు రామాయణంలో రాముడు ఏ విధంగా లోకకళ్యాణం కోసం పరిపాలన చేశారో కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని తెలిపారు.ఏ ఆశయంతో నైతే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఆ ఆశయ సాధన కోసం తండ్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో అపర చాణక్యుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నింపిన యువ నాయకుడు కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


