Malala Ranbheri Maha Sabha : నవంబర్ 2న హైదరాబాద్ లో జరుగుతున్న మాలల రణభేరి మహా సభను జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు వనపర్తి అంబేద్కర్ చౌక్ లో మాల మానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య వనపర్తి జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి అధ్యర్యంలో మాలల రణభేరి మహాసభ కరపత్రాల ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. Sc వర్గీకరణ ద్వారా మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను సరిచేయాలని అంతవరకు ఎలాంటి ఉద్యోగా నియమకాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్టీసీ ఉద్యోగాలలో 1747 పోస్టులలో ఎస్సీలకు 118 పోస్టులు కేటాయించింది. అందులో మాదిగలకు 90 పోస్టులు కేటాయించి మాలలకు కేవలం 28 పోస్టులు మాత్రమే కేటాయించడం దారుణమని పేర్కొన్నారు. ఇలా రోస్టర్ పాయింట్లలో 16 రోస్టర్ పాయింట్ కేటాయించకుండా 22వ రోస్టర్ పాయింట్ కేటించడం వలన వేల సంఖ్యలో మాలలు ఉద్యోగాలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మాల సమాజాన్ని కోరారు. నవంబర్ 2న హైదరాబాదులో జరిగే మాలల రణభేరి సభకు మాలలు వేలాదిగా తరలివచ్చి హైదరాబాదులో దిగ్బంధం చేసి మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని,నష్టాన్ని ప్రభుత్వానికి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర యుజన అధ్యక్షుడు వి. సుధాకర్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి. రమేష్ కుమార్, వనపర్తి మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు అంబాటి రవి, వనపర్తి మండల అధ్యక్షుడు విజయ్, రమేష్,నాగరాజు, శివ, బీజ్జా వెంకటేష్, చిన్న దాస్, పెద్ద దాస్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Malala Ranbheri Maha Sabha

You cannot copy content of this page

Scroll to Top