AISF : విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తాం

TRINETHRAM NEWS

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి..ఏఐఎఫ్ఎస్ డిమాండ్…

త్రినేత్రం న్యూస్, కాకినాడ,సెప్టెంబర్,20 విద్యారంగ సమస్యలను పరిష్కరించలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని నిరసన ధర్నా జరిగింది.

ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ కాకినాడ జిల్లా కన్వీనర్ ముమ్మిడి సతీష్ బాబు హాజరయ్యారు. సతీష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామని, విద్యార్థుల ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేదని ఆయన హెచ్చరించారు. విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని, ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలకు నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని తక్షణమే మంజూరు చేయాలని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాలని, కార్పొరేటు, ప్రైవేటు కాలేజీలలో అధిక ఫీజులు బస్సులను నియంత్రించాలని, అధిక ఫీజు వసూలు పై జిల్లా డీఈవో అధికారి తనిఖీలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మేంట్ తక్షణమే విడుదల చేయాలని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ, సురేష్, రాజేష్, శ్రీనివాస్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will protest if education and medical sectors

You cannot copy content of this page

Scroll to Top