
CCTV Cameras Installed : త్రినేత్రం న్యూస్ : బస్సుల్లో జరిగే దొంగతనాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పసిగట్టేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. బస్సుల్లో అమర్చిన ఈ కెమెరాల విజువల్స్ అన్నింటినీ ఆర్టీసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం 175 బస్సుల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe