BVN Modular Skill Academy : బివిఎన్‌ మాడ్యులర్‌ స్కిల్‌ అకాడమిలో

TRINETHRAM NEWS

పర్నిచర్‌ తయారీలో నైపుణ్య శిక్షణ
రాజమహేంద్రవరం, మే 19 : ఫర్నిచర్‌ అండ్‌ ఫినిషింగ్‌ స్కిల్‌ కౌన్సిల్‌(ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సి) ఆధ్వర్యంలో ఎపి మాడ్యులర్‌ ఫర్నిచర్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో స్థానిక లాలాచెరువులో గల బివిఎన్‌ మాడ్యులర్‌ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సి స్కిల్‌ అకాడమిలో పర్నిచర్‌ తయారీ రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. 10వ తరగతి కనీస విద్యార్హతతో 16 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారు ఈ శిక్షణకు అర్హులు. మూడు నెలలపాటు అందజేసే ఈ శిక్షణలో బ్యాచ్‌కు 20 మందికి పర్నిచర్‌ తయారీ, ఇనస్టాలేషన్‌, డిజైనింగ్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ మెషిన్‌ ఆపరేటింగ్‌ ఇన్‌ ఫర్నిచర్‌ మాన్యుప్యాక్చరింగ్‌, మెషినరీ ఉపయోగించి పర్నిచర్‌ తయారీ, ఇన్‌స్టాలేషన్‌ వంటి అంశాలలో తర్పీదునిస్తారు. పర్నీచర్‌ తయారీలో శిక్షణతో పాటు శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తారు.

శిక్షణతో పాటు ప్యాక్టరీ వాతావరణం, అక్కడ పరిస్థితులు, పని విధానం తెలుసుకునే విధంగా క్షేత్రస్థాయి శిక్షణ కూడా కల్పిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం స్థానిక బివిఎన్‌ మాడ్యులర్స్‌ పాక్టరీలోని బివిఎన్‌ మాడ్యులర్‌ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సి స్కిల్‌ అకాడమిలో ప్రారంభమయ్యింది. బివిఎన్‌ మాడ్యులర్స్‌ అధినేత బివిఎన్‌ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త మంతెన కేశవరాజు, ఎస్‌డిఎస్‌ ఎంట్రర్‌ ప్రైజెస్‌ అధినేత కె లక్ష్మినారాయణ, నిడో ఇండస్ట్రీస్‌ విజయవాడ అధినేత శ్యామ్‌ రెడ్డి, ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సి వైస్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ శశి, ఆ సంస్ధ మరో ప్రతినిధి పి ప్రశాంత్‌, ఎపి కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రంగబాబు తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్నిచర్‌ రంగంలో అధిక భవిష్యత్‌ ఉందని, ఇక్కడ అందజేస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఈ రంగంలో నైపుణ్యం పొందిన వారికి అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శిక్షణ పొందిన విద్యార్ధులకు నేషనల్‌ స్కిల్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్ధ నుండి సర్టిఫికెట్‌లు అందిస్తామని ట్రైనర్‌ విశ్వనాధ్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్‌ అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధులు, శిక్షణకు హాజరయ్యే విద్యార్ధులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BVN Modular Skill Academy

You cannot copy content of this page

Scroll to Top