
అమ్మ ప్రేమను వెలకట్టలేమన్న చిన్నారి కేశ్వి ప్రసంగం – తొలి బహుమతి కైవసం
BVK School : హుకుంపేట (అల్లూరి జిల్లా) జులై 31, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని స్థానిక బీవీకే పాఠశాలలో ‘మాతృ వందనం’ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మాతృమూర్తుల ప్రేమ, త్యాగం, సేవలను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక జర్నలిస్టు భాస్కర్–శివ, గోపి, లక్ష్మి దంపతుల కుమార్తె, కొండా జి. రమణ మనవరాలు అత్త,మామ సంతోష్,క్రిష్ణవేణి మేనకోడలు ఆకుపాటి కేశ్వి విహాన్స్ “అమ్మ” గొప్పతనంపై హృదయాన్ని హత్తుకునేలా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకుంది.తన ప్రసంగంలో, “అమ్మ మనకు ప్రాణం పోసిన దేవత. మనకు మొదటిసారి మాటలు నేర్పేది, నడక నేర్పేది, మంచి–చెడులను తెలియజేసేది అమ్మే. కష్టాల్లో ధైర్యం చెప్పేది, విజయాల్లో ఆనందపడేది కూడా అమ్మే.
అమ్మ ప్రేమకు వెలకట్టలేం. జీవితాంతం అమ్మను గౌరవించి, ఆమెకు కృతజ్ఞతతో ఉండటం ప్రతి బిడ్డ బాధ్యత” అని చిన్నారి భావోద్వేగంగా వివరించింది.చిన్నారి ప్రసంగానికి న్యాయనిర్ణేతలు తొలి బహుమతిని ప్రకటించగా, పాఠశాల యాజమాన్యం ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జ్ ఆచార్యులు చిన్నారికి బహుమతిని అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe