Road Works : బస్కీ, కొంత్రాయిగూడ, కోర్రగూడ, రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించిన సియ్యారి దొన్నుదొర

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 14 : అరకు వేలి మండలం బస్కి నుంచి కొంత్రయిగుడ బిజ్జగూడ మీద నుండి కొర్రగూడ వరకు వేస్తున్న రహదారి పనులను తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర గురువారం పరిశీలించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కొణిదెల పవన్ కళ్యాణ్.

ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 7 కిలోమీటర్ల పాటు నిర్మించిన ఈ రహదారి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ పనులను దొన్ను దొర పరిశీలించి నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. నాణ్యతతో రహదారులను నిర్మించాలని ఆ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు అని అధికారులు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన తెలిపారు రూ. 3.6 కోట్లతో నిర్మిస్తున్న ఈ రహదారి పనులు త్వరలోనే పూర్తికానున్నాయని దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని అధికారులు చేశారని తెలిపారు. ఎక్కడైనా రహదారి నిర్మాణంలో నాణ్యత లోపిస్తే స్థానికులు తనకు తెలియజేయాలని సూచించారు.

ఇప్పటివరకు అధికారులు నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తన పరిశీలనలో తేలిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమర్ది లైసోన్, పిసా అద్యక్షుడు పాంగి రావి, సర్పంచ్ పాడి రమేష్ , మాజీ ఎంపిటిసి బలరాం , మాజీ ఎంపీటీసి నూకరాజు, ఎంపిటిసి కిల్లో రామన్న క్రిష్ణన్నమూర్తి, మాజీ సర్పంచ్ సమర్డి కామరాజు, మాణిక్యం, సభాపతి, మాదల సర్పంచ్ వంతాల శ్రీనివాసరావు, పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

quality of road works

You cannot copy content of this page

Scroll to Top