BRSV Leaders Pre-Arrest : బిఆర్ఎస్వి నాయకులు ముందస్తు అరెస్ట్

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూలై 04 త్రినేత్రం న్యూస్. శుక్రవారం నిరుద్యోగులు చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్వి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేసినా రేవంత్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పిండో తక్షణమే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిర్బంధపాలన కొనసాగిస్తున్నాడు అని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను తప్పక నెరవేర్చాలని ఈసందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు గుర్రం సురేష్, బుషిపాక సాయి తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRSV leaders pre-arrested

You cannot copy content of this page

Scroll to Top