బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 12 త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబావి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల నుంచి పలువురు యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ భవిష్యత్ లో సముచిత స్థానం ఉంటుంది అని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి ఏ సీ ఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి,మాజీ సర్పంచ్ శ్రీను,వెంకటయ్య,ఎల్లయ్య,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


