దేవరకొండ నియోజకవర్గ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ ఆగష్టు 08 త్రినేత్రం న్యూస్. ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గ సోదరసోదరీమణులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం అని ఆయన తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


