వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. బీసీ రిజర్వేషన్స్ పెంపుదల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని తట్టుకోలేక నిండు ప్రాణాల ర్పించిన సాయి ఈశ్వరాచారికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా, ఉద్యోగ,ఉపాధి రంగాలలో 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు,ఆ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% మాత్రమే కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈశ్వరాచారి ప్రాణ త్యాగం చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.జగద్గిరిగుట్ట బీరప్ప నగర్ లోని స్వర్గీయ ఈశ్వరాచారి నివాసాన్ని రవిచంద్ర, పటేల్, యాదవ్ తదితర ప్రముఖులు ఆదివారం సాయంత్రం సందర్శించి ఆయన చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అమరవీరుడు ఈశ్వరాచారి అకాల మరణం పట్ల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్, బాలరాజు యాదవ్ తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.ఈ సందర్భంగా దివంగత ఈశ్వరాచారి తల్లి ప్రమీల, సోదరుడు నందీశ్వర్,ఈశ్వరాచారి సతీమణి కవిత, కూతుళ్లు క్రితిక,సాయి చిట్టి, కుమారుడు సాయిదత్తాలను వారు ఓదార్చారు, పరామర్శించారు,తమతో పాటు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


