
త్రినేత్రం న్యూస్ : మార్చ్ 1 :నెల్లూరు జిల్లా: బోగోల్ బిట్రగుంట. రైల్వే గేట్, దగ్గర ప్రజలు వాహనదారులు, రైల్వే గేట్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇంత అంత కాదు, ఈ ఇబ్బందులు ఈనాటిది కాదు, రోజురోజుకీ వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు మరింత తీవస్తాయికి చేరుకోవడం జరుగుతుంది,దీనికి ప్రధాన కారణం, ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బంది లేకపోవడమే కారణం అంటూ ప్రజలు వాపోతున్నారు, ఒక దిశలో భయాందోళనకు గురి అవుతున్నారు, రైల్వే గేట్ సమీపంలో రోడ్డుకి ఆనుకొని అంగళ్లు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కావచ్చు రోడ్డుకి ఇబ్బందికరంగా ఉంచడం మొదటి కారణం అయితే, ఆటోలు ద్విచక్ర వాహనదారులు రోడ్డు పక్కన నిలపడం ఒక కారణం అని చెప్పుకోవచ్చు,
సుమారు 20 నిమిషాలు పైగా రైల్వే గేట్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు ఒకపక్క ట్రైన్ వస్తున్న మరో పక్క ఒకవైపు గేటు వేసి మరోవైపు వేయలేకపోవడం దానికి కారణం, రోడ్డు మలుపులలో, చిరు వ్యాపారస్తులు రోడ్డు ఆనుకొని ఉన్న ఆంగ్లలు కావచ్చు వాహనాలు కావచ్చు ట్రాఫిక్ నియంత్రణను పాటించకుండా ఎటుపడితే అటు వాహనాలు నిలుపుకుంటూ ఎదురొచ్చే వాహనాలకి దారి ఇవ్వకుండా ట్రాఫిక్ నియంత్రణను పాటించకపోవడం ప్రధాన కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నట్టు తెలియపరిచారు దీనికి సంబందిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడో ఇబ్బందులు కలిగినప్పుడు తప్ప ఏదో వార్తలు వచ్చినప్పుడు తప్ప మరి పట్టించుకోని అధికారులు అంటూ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తపరిచారు తక్షణమే ట్రాఫిక్ నియంత్రణ కు సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
