Trinethram News : హైదరాబాద్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్ ని అధికారికంగా నియమిస్తూ, TRP రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు నేడు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, యువత చైతన్యం, బీసీ – బహుజన హక్కుల రక్షణలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని సూచించారు. యువతకు ఆత్మవిశ్వాసం నింపే నాయకుడిగా చంద్రశేఖర్ నియామకం పార్టీకి నూతన శక్తిని తీసుకొస్తుందని అన్నారు.
“యువతలో నూతన ఊపు తీసుకురావాలి… TRPను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి… ప్రజల సమస్యలకు పక్షపాతం లేకుండా నిలబడాలి…” అని మల్లన్న సూచించారు.
ఈ కార్యక్రమంలో TRP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య, నాయకులు పాకాల నర్సింహ్మ, చింతపండు ప్రభాకర్, కిరణ్ ముదిరాజ్, డాక్టర్ సూర్య నారాయణ, వినీత్, శ్రీనివాస్, దశరథ, మల్లేష్, సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు.
TRP యువజన విభాగంలో కొత్త నాయకత్వం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. యువతకు చేరువగా, బహుజన హక్కుల కోసం పోరాడే దిశగా చంద్రశేఖర్ యువజన విభాగాన్ని ముందుకు నడిపిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


