Trinethram News : Jul 15, 2025, ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రాంచందర్ రావు ఎంపిక పట్ల చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లిలో బీజేపీ నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. భట్టి వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ సెల్ కో కన్వీనర్ ఈర్ల శంకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. భట్టి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


