
Danger Lurking : అరకులోయ,ఆగస్టు 13, (త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం గన్నెల పంచాయతీ పరిధిలోని గన్నెల గ్రామంలో పాతబడిన విద్యుత్ స్తంభాల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని వారు తెలిపారు.
ముఖ్యంగా కొండవీదిప్రాంతంలో విద్యుత్ స్తంభాల కొరత తీవ్రంగా ఉందని, ప్రస్తుతం ఒకే స్తంభం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభాలు పాతబడిపోవడంతో కరెంటు తీగలు, స్తంభాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో కీటకాలు, ఇతర ప్రమాదాల భయం కూడా ఉంటోందని పేర్కొన్నారు.
పంచాయతీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు, కొండవీది ప్రాంతంలో అదనంగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe