జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Bike hits parked lorry

ఒకరు మృతి మరొకరికి గాయాలు..

లింగారెడ్డి గూడా గ్రామ సమీపంలో ఘటన..

Bike hits Parked Lorry : ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో లింగారెడ్డి గూడా వద్ద ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు షాద్ నగర్ వైపు వెళుతున్న లారీ రిపేర్ కారణంగా రహదారి పక్కన నిలపడంతో షాద్ నగర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో నందిగామ మండలం అప్పరెడ్డిగూడా గూడా గ్రామాన్నికి చెందిన చిన్నంత్ర కార్తీక్ (20) అక్కడికక్కడే మృతి చెందాగా మరో వ్యక్తి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page