త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ వల్లభశెట్టి శివ పద్మిని రామ సతీష్, స్వగృహం నందు; వారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దుప్పలపూడి ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికలకు విద్యా సౌలభ్యం కోసం ఈ సైకిళ్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా ఇన్‌చార్జ్ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, మరియు అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తదితరులు పార్టీ నాయకులు, మండల నేతలు,ప్రజాప్రతినిధులు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


