Gurukula School : భయం గుప్పెట్లో, ఎండపల్లి వలస గురుకుల పాఠశాల బాలికలు.రక్షణ గోడ ఎక్కడ. కె రామారావు

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్.మార్చి 3: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎండపల్లి వలస బాలికల గురుకుల పాఠశాలలో రక్షణ గోడ నిర్మిచాలని ఆదివాసీ గిరిజన సంఘం. ఆధ్వర్యంలో పిల్లల తల్లి దండ్రులతో ఆదివారం, నిరసన తెలిపారు.
ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు మాట్లాడుతూ ఎండపల్లి గురుకుల పాఠశాల ఎంట్రన్స్ అవరణంలో రెండు సంవత్సరాల క్రితం కురిసిన బారి వర్షలకు నాణ్యత ప్రమాణాలు పాటించ కుండా నిర్మించిన రక్షణ గోడ కూలింది.గురుకుల బాలికల పాఠశాలలో రక్షణ గోడ లేకపోవడంతో ఇక్కడ చదువుతున్న తమ పిల్లలకు రాత్రి సమయంలో అసంఘీక వ్యక్తులు నుండి రక్షణ లేకుండా పోతుందని పిల్లల తల్లి తండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఇక్కడ ఏకలవ్య, గురుకుల కళాశాల పాఠశాలలు నడుస్తున్న, కనీసం పిల్లలకు రక్షణ గోడ లేకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యం అని తెలుస్తుంది, రక్షణ గోడ కూలి రెండు సంవత్సరాలు కావస్తున్న సంబంధిత అధికారులు స్పందించక పోవడం చాలా బాధాకరం దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే రక్షణ గోడ నిర్మించి పిల్లలకు బయట వ్యక్తుల నుండి రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కె రామారావు విద్యార్థుల తల్లి తండ్రులు బోడయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Endapalli Migrant Gurukula School

You cannot copy content of this page

Scroll to Top