Government Funds : ప్రభుత్వ నిధులు దుర్వినియోగం

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) మే28త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము లో మండల ప్రాదేశిక సభ్యురాలు 2023లో రెండు లక్షల 25 వేల తో నిర్మించిన అండర్ వాటర్ డ్రైనేజీ నిర్మాణాన్ని దుర్వినియోగం చేసిన ఆర్ అండ్ బి అధికారులు మరియు రోడ్డు వేస్తున్న సదరు కాంట్రాక్టర్.
అభివృద్ధి పేరుతో ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులను అంతా ధ్సంసం చేస్తూ తన ఇష్టం వచ్చినట్లుగా తను చెప్పింది వేదంగా, అధికార మదంతో తన ఇష్ట రీతిగా, నాసిరకంగా (మెటీరియల్ క్వాంటిటీ తగ్గిస్తూ) రోడ్డు వేస్తున్న సదరు కాంట్రాక్టర్. రోడ్డు పేరుతో 2023 సంవత్సరంలో రెండు లక్షల 25000 నిర్మించిన అండర్ వాటర్ డ్రైనేజీ నీ ధ్వంసం చేసి కాలనీ ప్రజలు అడిగితే దాటవేయు ప్రయత్నం చేస్తూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు.
ఈ అండర్ డ్రైనేజీ వాటర్ లైన్5సం”” మన్నికగా ఉంటుందని ఒక 20 ఇండ్ల వాళ్లకు వర్షం వచ్చినా నీరు సమస్యగా మారింది కాలనీ వాళ్లు అడిగితే రోడ్డు వేస్తున్న అందులో భాగంగా తీసేసాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. ఉన్న అండర్ డ్రైనేజీ వాటర్ లైన్ తీసివేయడం ఎందుకు అని కొత్తది వేయడం ఎందుకు ఉన్నదాన్ని సరి చేస్తే అయిపోతుండే కదా అని కాలనీ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఆర్ అండ్ బి డి ఈ కి వివరణ అడగగా నిమ్మకు నీరెత్తినట్లుగా సమాధానం చెప్పకుండా దాటవేయు ప్రయత్నం చేస్తున్నారని కాలనీ ప్రజలు అధికారులపై ఆగ్రహిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వచ్చి రోడ్ సమస్యలను ,రోడ్డుకు ఉపయోగిస్తున్న మెటీరియల్ ను పరిశీలించి , అంగడి బజార్ లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ,ఎలాంటి సమస్యా,రాకుండా ఉండేవిధంగా చూసి ఆతరువాత రోడ్డు పనులను ప్రారంభించాలని డిండి మండల కేంద్రము లోని ప్రజలు ఆర్ అండ్ బి అధికారులను కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Misuse of government funds

You cannot copy content of this page

Scroll to Top