జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 23 at 8.58.49 PM

TRINETHRAM NEWS

మనిషికి ధర్మ మార్గాన్ని చూపేది భగవద్గీత : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఈరోజు 129- సూరారం డివిజన్ పూర్ణిమ విద్యానికేతన్ మైదానంలో శివశక్తి ధ్యాన యోగ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ కుల,మత, వర్గ, వర్ణలకు అతీతంగా సాటి మనిషికి అపాయం తలపెట్టకుండా మనల్ని జీవించమంటూ ధర్మ మార్గాన్ని తెలియజేసేదే భగవద్గీత అన్నారు. ఇంతటి మహత్యం కలిగిన భగవద్గీత సారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యేక దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషమన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page