ధర్మసాగర్ జులై 19 ( త్రినేత్రం న్యూస్) హనంకొండ జిల్ల ధర్మసాగర్ మండలం పరిధిలోని ధర్మసాగర్, ఎలుక్కుర్తి సాయి పేట గ్రామాల్లో వెలిసిన బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి షాపుల నిర్వహణ మూడు అద్భుతంగా విరాజిల్లుతుంది. మండలంలో ఒక్కకా గ్రామంలో 20 బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన మద్యం అమ్మకాలు మండల స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఎనీ టైం మందు (ఏటీఎం) గా మారాయి. మండల కేంద్రంలోని వైన్ షాపులకు సెట్టింగ్ పర్మిట్లు ఇవ్వడంతో ఆ షాపుల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ప్రధానంగా మహిళలు, పిల్లలు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అదే తరహాలో గ్రామాల్లో నిర్వహించే బెల్ట్ షాపుల తో ప్రజల అసౌకర్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రహదారులు గుడి, బడి, నివాస ప్రాంతాలు అని తేడా లేకుండా సాగుతున్న మద్యం అమ్మకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
క్వార్టర్ కు 30 నుండి 40 అదనం రాత్రి వెళ్లాలో ఇంకా ఎక్కువ ధర కి అమ్ముతున్నారు మండల కేంద్రంలోని మద్యం షాపు యజమానులు సిండికేట్ గా మారి గ్రామాల్లోని బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం షాపుల యజమానులు బెల్ట్ షాపు నిర్వాహకులకు అదనపు రేట్లతో మద్యాన్ని విక్రయిస్తారు. సామాన్యులు మద్యం తాగి ఆరోగ్యాన్ని, అధిక ధరలు చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న, అధిక ధరలకు మద్యం అమ్ముతున్న పట్టించుకునే నాధుడే లేకపోవడంతో మద్యం విక్రయదారుల పంట పండుతుంది. మద్యం షాపుల నిర్వహణను పర్యవేక్షించి బెల్ట్ షాపుల నిర్వహణ అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నెలవారి మామూళ్లతో మిన్న కుంటున్నారని విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్, విజిలెన్స్ అధికారులు స్పందించి గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాప్ లను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


