అల్లూరిజిల్లా పాడేరు, త్రినేత్రంన్యూస్ జూలై 21: గిరిజన హక్కుల పరిరక్షణకు సంబంధించి జీవో నెంబర్ 3పై పాడేరు ఐటిడిఏ సమావేశ మందిరంలో జూలై 22న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణ వర్క్‌షాప్‌కు గిరిజనులు, ప్రజాప్రతినిధులు, జనసేన కార్యకర్తలు హాజరుకావాలని జనసేన పాడేరు నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇన్‌చార్జ్ వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ సంచాలకులు సదా భార్గవి అధ్యక్షత వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరి చేయడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందన్నారు. జీవో నం.3 అమలు, గిరిజన చట్టాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజల నుంచి లిఖిత పూర్వక అభిప్రాయాలను వర్క్‌షాప్‌లో అందజేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


