ఏ .టీ . కృష్ణ ( దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ .)
డిండి(గుండ్లపల్లి) అక్టోబర్ 09 త్రినేత్రం న్యూస్. ఎంపీటీసీ జడ్పీటీసీ. వార్డ్ మెంబర్. సర్పంచ్ ఎన్నికల పై హై కోర్ట్ స్టే విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని బి జె పి దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ఏ టి కృష్ణ దుయ్యబట్టారు .స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారహితంగా ఎన్నికలను వాయిదా వేసే విధంగా తొందరపాటు చర్యలతో బీసీలను బలి పశువులను చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ తెలంగాణలో ఎన్నికలు నిర్వహించకుండా బీసీలకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనే సాకులు చూపిస్తూ దానికి కావలసిన ప్రణాళిక బద్ధంగా చట్ట సవరణ చేయకపోవడం తద్వారా బీసీలను కించపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయం. ఇప్పటికైనా కోర్టుకు సరైన నివేదికను ఇచ్చి బీసీలకు రాజకీయంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


