Mon. Mar 9th, 2026

BC Leaders : మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ,చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన బీసీ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 16:నెల్లూరు జిల్లా :కావాలి.. పెద్దపవని రోడ్డు వైకుంఠపురం సెంటర్ నందు కావలి నియోజకవర్గం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ బీసీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య , చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన బీసీ నాయకులు,కుమ్మరి సంఘం నాయకులు.

ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు యేగూరి పెద్దపుల్లయ్య మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల కోసం, కుమ్మరి కులస్తుల ఉన్నతి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి ఐలాపురం వెంకయ్య , నిన్న శివైక్యం చెందడం యావత్తు బీసీ సమాజాన్ని, కుమ్మరి కులస్తులను తీవ్రంగా కలచివేసింది అని తెలియజేశారు. కుమ్మరి సంఘం నాయకులు, అడ్వకేట్ బెజవాడ అభిసాగర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఐలాపురం వెంకయ్య , స్ఫూర్తిగా తీసుకొని బీసీల ఆత్మగౌరవం కోసం, కుమ్మర్ల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటాలు చేస్తాము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు బెజవాడ ఏడుకొండలు, బెజవాడ రవీంద్ర, గుడ్లూరి మాల్యాద్రి, యేగూరి చిన్నపుల్లయ్యా, కొర్రపాటి బాలయ్య, బెజవాడ సప్తగిరి, మన్నేపల్లి తిరుపాలు, మన్నేపల్లి భాస్కర్, మన్నేపల్లి పెంచలయ్య,నాగేశ్వరావు, యేగూరి బాబీ,బెజవాడ వేణు మాధవ్,బీసీ నాయకులు అద్దంకి ప్రభాకర్, నాయుడు పరిశుద్ధ రావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BC leaders pay tribute to former MLC Ailapuram Venkaiah

Related Post

You cannot copy content of this page