BC Declaration : బీసీ డిక్లరేషన్‌పై రామగుండంలో ఘనంగా పాలాభిషేకం

TRINETHRAM NEWS

గోదావరిఖని చౌరస్తాలో జయజయహే పలికిన బీసీ నాయకులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బీసీ డిక్లరేషన్‌లో భాగంగా విద్యా, ఉపాధి, రాజకీయ, వ్యాపార రంగాలలో బీసీ వర్గాల వారికి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రకంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పాలాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గట్ల రమేష్ అధ్యక్షతన, ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో బాణాసంచా పేల్చి, స్వీట్లను పంపిణీ చేస్తూ బీసీ వర్గానికి ఈ నిర్ణయం చైతన్యం తీసుకువస్తుందనే ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా మొదటిసారి ఒక సంకల్పబద్ధమైన ప్రభుత్వం పని చేస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొంటోంది,” అన్నారు నాయకులు పెండ్యాల మహేష్, గట్ల రమేష్ మాట్లాడుతూ “ఈ చారిత్రక నిర్ణయం వల్ల లక్షలాది బీసీల జీవితాల్లో వెలుగు మెరుగుతుంది.

ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రామగుండం ప్రజలకు ప్రతినిధులుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం,” అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగ స్వామి, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, ఎండీ. ముస్తఫా, పాతపెల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, కొమ్ము వేణు, నజీమొద్దీన్, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, సింహాచలం, ధూళికట్ట సతీష్,గడ్డం శ్రీనివాస్, ఇండ్ల ఓదెలు,గౌస్, మోయిద్ సన్నీ, కౌటం సతీష్, దొంతుల కిరణ్, డేవిడ్, మాదరవేన కిరణ్, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో హాజరై, తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BC Declaration grandly inaugurated

You cannot copy content of this page

Scroll to Top