నవంబర్ 21, 2026
TRINETHRAM NEWS
Intensifies Campaign

Intensifies Campaign : అరకు లోయ నవంబర్ 3, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండల కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. జెడ్పీటీసీ అభ్యర్థి శెట్టి దివ్య, ఎంపీటీసీ అభ్యర్థి పాంగీ ధన ప్రజలను నేరుగా కలుసుకుంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ప్రజలకు వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్‌తో పాటు పార్టీ నాయకులు నాయుడు, మహేష్ తదితరులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తమ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి శెట్టి దివ్య, ఎంపీటీసీ అభ్యర్థి పాంగీ ధనలకు చీపురు గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page