Bank Employee Dies : జిమ్‌ చేస్తూ బ్యాంకు ఉద్యోగి మృతి

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ పలమనేరు (చిత్తూరు) : కండల కోసం అధికంగా ఆరాట పడితే, చివరకు కాకులకు పిండం పెట్టాల్సిన పరిస్థితులు కరోనా తర్వాత ఏర్పడుతున్నాయి.

చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం ఉదయం ఓ బ్యాంకు ఉద్యోగి హఠాత్తుగా చనిపోయాడు. స్థానిక గుడియాత్తం రోడ్డులో ఉన్న ఓ జిమ్‌ సెంటర్లో పాత పేటకు చెందిన మల్లికార్జున ఏకైక కుమారుడు విశ్వనాథ్‌ అనే యువకుడు ఈరోజు ఉదయం జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు.

బయటకు వచ్చి వాంతులు చేసుకున్నాడు. వెంటనే స్నేహితులు వచ్చి కొబ్బరి నీళ్లు తాగించి పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విశ్వనాథ్‌ వి. కోట డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bank employee dies while doing gym

You cannot copy content of this page

Scroll to Top