కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 10 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, బండి రమేష్ నియోజకవర్గ పరిధిలోని , ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో హస్మత్ పెట్ లో సోమవారం విస్తృతంగా పర్యటించారు.స్థానిక నాయకులు ప్రస్తావించిన సమస్యలపై ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సూచించారు. ముందుగా డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 1 లో ఉన్న 108 ఎకరాల ప్రభుత్వ స్థలానికి గాను ప్రస్తుతం కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఎమ్మార్వో ఆర్డీవోలతో రమేష్ మాట్లాడారు.
కబ్జాకు గురైన స్థలం ఎవరి చేతిలోకి పోయిందో సర్వే చేసి తేల్చాల్సిందిగా సూచించారు.మిగిలిన స్థలంలో స్థానిక ప్రజల అవసరాల మేరకు కమ్యూనిహాలు ఇతర అవసరాల కోసం కేటాయించాలని సూచించారు. వడ్డెర బస్తి స్మశాన వాటికలో కనీస అవసరాలు అయిన బోరు, స్నానాలగది ఏర్పాటు చేయాలని సంబంధిత ఈఈకి సూచించారు. అనంతర అంజయ్య నగర్ లో ఖాళీగా ఉన్న 2వేల గజాల స్థలం నో కబ్జా కాకుండా కాంపౌండ్ వాల్ కట్టడం జరుగుతుంది. ఆంజనేయ నగర్ లో సర్వేనెంబర్ 57 లో ఉన్న స్థలంలో యాదవ సోదరులకు మల్లన్న దేవాలయం నిర్మించాలని స్థానికులు కోరడం జరిగింది .ఆయా సమస్యల పరిష్కారం కోసం రమేష్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండుగుల యాదగిరి, మల్లికార్జున యాదవ్, రాజేందర్, అస్లాం, అంజాద్ ,లక్ష్మయ్య విజయలక్ష్మి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


