నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Balakrishna

Balakrishna : శ్రీ సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01; హిందూపురం మున్సిపాలిటీ 3వ వార్డు చౌడేశ్వరి కాలనీలో డైనమిక్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం ప్రసాదించిన గొప్ప స్వేచ్ఛ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సమర్ధులైన అభ్యర్థులను వెన్నుకోవాలని ప్రజలకు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page