CM Chandrababu : మహానాడు వేదికగా కోవర్టులకు బాబు ఘాటు వార్నింగ్

TRINETHRAM NEWS

Trinethram News : ‘నేరస్థులూ ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ’ అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభమవగా.. సీఎం మాట్లాడుతూ.. నేరస్థులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవర్టులుగా పని చేస్తున్నారని.. వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డపేరు తెచ్చి.. సులభంగా వారి టార్గెట్‌లను హత్య చేస్తున్నారని కోవర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది నేరస్థులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవర్టులను టీడీపీలోకి(TDP) పంపించి.. ఆ కోవర్టుల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నారు.

ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదన్నారు. వలస పక్షులు వస్తుంటాయ్.. వెళుతూ ఉంటాయని… కానీ నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. పార్టీ బలోపేతం కావాలని.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బంధీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Babu's stern warning to

You cannot copy content of this page

Scroll to Top