AYS Leaders : కిరణ్ ను పరామర్శించిన AYS రాష్ట్ర జిల్లా నాయకులు

TRINETHRAM NEWS

చిట్యాల మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన గురుకుంట్ల కిరణ్ ను ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు గాయమయి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచన మేరకు ఇంటివద్ద ఉంటున్న విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ ను పరామర్శించి గుండె దైర్యం కలిగించారు.
ఈ సందర్భంగా అయ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ కిరణ్ నిస్వార్థంగా అంబేద్కర్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టిన ఇతనికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు.
పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ మండల నాయకులు పుల్ల ప్రతాప్ గుర్రపు రాజ మొగిలి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top