సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Awareness Seminar

Awareness Seminar : డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 02. త్రినేత్రం న్యూస్. డిండి మండలం కేంద్రంలో ని స్థానిక పిఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాల పై స్థానిక ఎస్సై సిహెచ్ బాలకృష్ణ విద్యార్థులకు వివిధ అంశాల పైన సైబర్ క్రైమ్ మైనర్ డ్రైవింగ్, గంజాయి, ఫోక్సో యాక్ట్, బాల్యవివాహాలు అంశాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

ఎస్ ఐ మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వలన శరీరం అంతా కూడా బక్కచిక్కి పోవటం,నరాలు చిట్లిపోవడం అనారోగ్య సమస్యలు వస్తాయని మత్తు కు దూరంగా ఉండాలని, విద్యార్థులు చిన్న వయసులోనే ప్రేమ పేరుతో జీవితం చిన్నాభిన్నం చేసుకోకూడదు అని, సోషల్ మీడియా లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తులకు ఓటిపి లను పంచుకోకూడదని, బెట్టింగ్ ఆఫ్ లకు దూరంగా ఉండాలని బెట్టింగ్ యాప్ ల వలన చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని , మైనర్ బాలురు ద్విచక్ర వాహనాలను నడపకూడదని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు శిరస్త్రాణంతప్పనిసరి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మైనర్లు వాహనాలు నడపకూడదని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు మంచి గా చదువుకుని ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, శ్రీలత,బిచ్చయ్య, సుశీల,రమా, కోదండరామ రావు, ఎన్ ఎన్ విజయ్ కుమార్,వేంకటేశ్వర్లు, చెన్నయ్య,రవి, విజయ్, బాలకృష్ణ, రమేష్, జ్యోతి, అశ్విని, రుంషా,సందీప్, ధనలక్ష్మి, తరుణ్ తేజ్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page