సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
YSR Services Immortal

YSR Services Immortal : అల్లూరి జిల్లా, అరకులోయ సెప్టెంబర్ 3, (త్రినేత్రం న్యూస్): గిరిజన, దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి అన్నారు. వైయస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శాంత కుమారి మాట్లాడుతూ 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు వైద్యం, విద్యా రంగంలో పలు కార్యక్రమాలతో విద్యార్థులకు భరోసా కల్పించారని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాధి సమస్యలకు శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు, 5వ షెడ్యూల్, పిసా 1/70 చట్టాల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page