Awareness Seminar : నందర్ఖాన్పేట్ గ్రామంలో ప్రకృతి/సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

త్రినేతం న్యూస్ /షాబాద్ ప్రతినిధి. వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాన్ దార్ఖాన్పేట్ గ్రామం లో దామర్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రకృతి మరియు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సు గ్రామ సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సదస్సులో ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజవర్ధన్ , రైతులకు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ విధానాలు, బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం వంటి ఆర్గానిక్ ద్రావణాల తయారీ విధానాలు గురించి సమగ్ర అవగాహన కల్పించారు. ఈ ద్రావణాలను ప్రత్యక్షంగా తయారు చేసి చూపిస్తూ వాటి ప్రయోజనాలను వివరణాత్మకంగా వివరించారు. రైతులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటల ఉత్పత్తిలో ఖర్చులను తగ్గించుకుంటూ, ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేయగలుగుతారని, తద్వారా వారి ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఈ కార్యక్రమం లో తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెల్స్పన్ ఫౌండేషన్ CSR హెడ్ శ్రీమతి సురేఖ, అసిస్టెంట్ మేనేజర్లు పవన్ కుమార్, భద్రయ్య, శ్వేత, గ్రామ కార్యదర్శి విజయ్ భాస్కర్ , కరోభార్ సురేందర్ పాల్గొన్నారు. గ్రామంలోని రైతులు ఈ సదస్సుకు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమం ప్రకృతి మరియు సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు మరియు గ్రామాభివృద్ధికి, వ్యవసాయ రంగంలో సుస్థిర పద్ధతులను అంగీకరించేందుకు కీలకమైన అడుగు నిలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness seminar on natural/organic farming

You cannot copy content of this page

Scroll to Top