Manda Krishna Madiga : కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు పురోగతిలో భాగంగా దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.

TRINETHRAM NEWS

ADGP చౌహాన్ గారికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి.

Trinethram News : కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు పురోగతిలో భాగంగా నిందితులైన పోలీసుల మీద చట్టపరమైన , శాఖాపరమైన చర్యలు వెంటనే తీసుకొని తగిన న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ అధ్యక్షులు ADGP D.S చౌహాన్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు వినతులతో కూడిన లేఖ అందించారు.

ఈ సందర్భంగా కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి చేసిన నేపథ్యంలో ఈ కేసు మీద జరుగుతున్న దర్యాఫ్తును వేగవంతం పూర్తి చేయాలని కోరారు.సమగ్రమైన , సత్వరమైన , నిష్పక్షపాతమైన దర్యాప్తును జరిపి రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు మీద పోలీస్ శాఖ తీసుకుని నిర్ణయం మీద సమాజమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుందని అన్నారు కావున ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద మరింత నమ్మకం గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో ఇలాంటి లాకప్ డెత్ ఘటనలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా దళితులకు మరియు అణగారిన వర్గాలకు పోలీస్ స్టేషన్లో తగిన న్యాయం జరిగే అందేవిధంగా నమ్మకాన్ని కలిగించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ పాల్గొన్నారు.

సామాజిక ఉద్యమ నమస్కారాలతో..

డా.గోవిందు నరేష్ మాదిగ
MRPS రాష్ట్ర అధ్యక్షులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

As part of the progress of the Karla Rajesh lockup death case

You cannot copy content of this page

Scroll to Top